విశాఖ గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్)పెద గంట్యాడ (గంగవరం): నేటి యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలని వైసిపి గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ 64 వ వార్డు గంగవరం జాలారి పల్లి పాలెం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిమ్ కు వార్డు ఇన్చార్జి ధర్మాల శ్రీనివాసరావు 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గాజువాక వైసీపీ ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి, ధర్మాల శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే, ఆరోగ్యం తో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు ఎప్పుడు ముందుంటామని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సమస్యలను వార్డు అధ్యక్షడు ధర్మాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే సహకారంతో సమస్య పరిష్కరిస్తామని దేవన్ రెడ్డి తెలిపారు. కార్య క్రమంలో పల్లేటి పెంటయ్య, నూక రాజు, దుర్గా రావు, యల్లజి, అమ్మోరు సలీం, హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ వైసీపీ నాయకులు యువకులు పాల్గొన్నారు.