విశాఖ గాజువాక జూలై 01 ( ఎస్‌ఎస్ 999 న్యూస్): ఉత్తరాంధ్ర ప్రజలందరూ అభిమానాలు పొందిన మహోన్నత వ్యక్తి విజయ సాయి రెడ్డి పుట్టిన రోజు వేడుకలు గాజువాక టీ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలొ షీలా నగర్ లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల అండగా నిలిచిన ప్రత్యక్ష దైవం విజయ సాయి రెడ్డి అని అన్నారు. ఒక్క విశాఖలోనే కాకుండా వైసీపీ లో కీలక పాత్ర పోషిస్తూ ఉత్తరాంధ్ర లో ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. భవసత్తు లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరిన్ని పదవులు చేపట్టలని, ఈ సందర్భంగ గాజువాక ప్రజల తరుపున వైఎస్సార్సీపీ నాయకులు తరుఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్య క్రమంలో వైసీపీ నాయకులు మార్టుపూడి పరదేశి, 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, కార్పోరేటర్ ఉరుకూటి చందు, పల్లా చిన తల్లి, రోజా రాణి, కోమటి శ్రీను, మహాలక్ష్మి నాయుడు, బొడ్డా గోవింద్, మహాలక్ష్మి నాయుడు, బుజ్జి, గోవింద్ నియోజక వర్గం వైసీపీ నాయకులు యువకులు కార్య కర్తలు తది తరులు పాల్గొన్నారు…