విశాఖ గాజువాక జూన్ 09 (ఎస్‌ఎస్999న్యూస్) హోల్ సేల్ మరియు రిటైల్ రాజీవ్ మార్గ్ కూరగాయల వర్తక సంఘం తరుపున  మా యొక్క హోల్ సేల్ మార్కెట్లు కణితి రోడ్డు మరియు రాజీవ్ మార్గ్ గల దుకాణాలు తెల్లవారుజాము 3 గంటల నుండి ఉదయం 8 గంటల లోపు వ్యాపారాలు ముగుస్తున్నాము.మా వలన జనాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోవిడ్-19 కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ మా యొక్క అద్దె దుకణాలలో వ్యాపారాలు చేయుచున్నాము.అలాగే ఇందులో భాగంగా చిల్లర వ్యాపారస్తులు జీవీఎంసీ మార్కెట్లో వర్తకులకు ఇబ్బంది లేకుండా జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యాపారము చేయుచున్నాము.ముఖ్య0గా కణితి రోడ్డు 80అడుగుల రోడ్డు కనుక ఈ రోడ్డులో ఒక కిలోమీటర్ పొడవునా రోడ్డు ఇరుప్రక్కలా ట్రాఫిక్ ఇబ్బందులకు గల కారణాలు గమనించి.అక్కడ ఎవరివలన.ఎందువలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నాదో జీవీఎంసీ వారు.ట్రాఫిక్ అధికారులు గమనించి హోల్ సేల్ కూరగాయలు ఉదయం 5 నుండి 8 వరకు దిగుమతుల మరియు ఎగుమతుల వ్యాపారం జరుగుతుందని ఈ విషయం జీవీఎంసీ మరియు ట్రాఫిక్ అధికారులకు తెలిసిందే.ట్రాఫిక్ అంత ఇబ్బందిగా జాం కావడానికి సంబందించిన ఆటోలు మరియు డిస్టిబ్యూటర్ వాన్ లు.ఎక్కువుగా రావడం వలన ప్రజలు కొంత ఇబ్బంది పడవచ్చు.అ విషయాన్ని మీ దృష్టికి తెచ్చిన వాళ్ళు ఉండవచ్చు.మీరు స్వయంగా పరిశీలించి మా కూరగాయలు వ్యాపారులు వలన ఎటువంటి ఇబ్బంది లేదని గ్రహించగలరు.మా వ్యాపారస్థులందరిని జీవీఎంసీ మరియు ట్రాఫిక్ పోలీస్ అధికారులు మా కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళని వుడా కాలనీ ఆదర్శ్ గ్రౌండ్ కి తరలించాలని ప్రయత్నించుచున్నారు.కావున మా యొక్క వ్యాపారాలు ఉన్నచోటే యదా ప్రకారం వ్యాపారాలు చేసుకొనుటకు అవకాశం కల్పించమని కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here