విశాఖ  గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్): పెదగంట్యడ 2 లక్షల 50 వేల మంది వాలంటరీ, లక్ష యాబై వేల సచివాలయం యువతీ, యువతకు ఉపాధి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే చెందుతుంది. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సచివాలయం,వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలనడం బాధాకరం అని గాజువాక వైసీపీ ఇంచార్జీ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసి 76 వార్డు సీతానగరం గ్రామంలో ఉన్న సచివాలయం సిబ్బంది,వాలంటరీ లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ చుదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కల్పించాలన్న సవుద్దేసంతో సుమారు రెండు లక్షల యాబై వేల మంది వాలంటరీ, లక్ష యాబై వేల సచివాలయంలో యువతీ, యువతకు ఉపాధి కల్పించిన ఘనత ఒక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి మాత్రమే చెందుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఉపాధి కల్పించారని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఇటువంటి వ్యవస్తను తొలగించాలని, పర్మినెంట్ చేయకూడదని కోర్టుకు వెళ్ళడం అన్యాయమని ఆవేధన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత కోసం మొట్ట మొదటి సారిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పార్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేవలం ప్రభుత్వము పై కుట్ర పన్నెందుకు బురద జల్లే కార్య క్రమం పెట్టుకుని అందులో సచివాలయం, వాలంటరి వ్యవస్త లో ఉపాధి పొందుతున్న యువతను భలి చేసే స్వార్థ ప్రయోజనాల ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వార్డు ఇంఛార్జ్ దొడ్డి రమణ మాట్లాడుతూ 1వ తేదీన అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటికి వెళ్లి ఫేంక్షన్ లు అందించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి దే, అలాగే ప్రభుత్వము చేపడుతున్న సంక్షేమ పథకాలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతుందనీ అన్నారు. ఇటువంటి సేవలు అందిస్తున్న వ్యవస్థపై కుట్ర పూరిత వ్యాఖ్యలు దారుణమని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నంత కాలం సచివాలయం, వాలంటరీ ఉద్యోగులకు ఏటువంటి ఇబ్బంది ఉండదని అది మీ చేతుల్లోనే ఉందని అన్నారు. కార్యక్రమంలో 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్,జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు పల్లా చినతల్లి,76 వార్డు నాయకులు అండిబోయిన సన్నీ,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.