విశాఖ గాజువాక జూన్ 10 (ఎస్‌ఎస్999న్యూస్) కరోన సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ సూచించారు.66వ వార్డు పరిది బీసీ రోడ్డులో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు సరఫరా చేసిన భోజనం పొట్లాలను గాజువాక తిప్పల నాగిరెడ్డి సూచనల మేరకు గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత 3 రోజుల నుండి వార్డులో ప్రతి ఏరియాలోకి పేద ప్రజల,రోజువారీ కూలీలు పనులు చేసుకుంటూ జీవనం కలాసి పనులు చేసుకునే వారు ఎక్కువగా ఉండటంతో కరోనా సమయంలో కర్ఫ్యూ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమయం లో స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సూచనలు మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో సుమారు 500మందికి ఆహార పొట్లాలను అందించడం జరిగిందని అలాగే వార్డులో మరో 3రోజులు పాటు ఆహార పొట్లాలు ప్రజలకు కార్పొరేటర్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్సి సెల్ పాము శాస్ట్ర(రాజా),పేదిరెడ్ల ఈశ్వరరావు, చిత్రాడ వెంకట్,షఫీ,మోతి,రమణారెడ్డి,దేముడుబాబు,శ్రీనివాసరెడ్డి,వైస్సార్సీపీ పండు,రవి,బాషా,నయిమ్,అలాగే ఇమ్రాన్ యువసేన సభ్యులు,వార్డు నాయకులు,మహిళలు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here