విశాఖ గాజువాక జూలై 20 (ఎస్‌ఎస్999న్యూస్): సమాజంలో సాటి వారికి సాయం అందించే సుగుణం ఒక్క సామాజిక సేవా దృక్పథం, స్ఫందించే సహృదయులకు మాత్రమే అది సాధ్యమని అలా నిరూపించుకున్న వారిలో గాజువాక ఎన్నో స్వచ్ఛందంగా
సేవా కార్యక్రమాలు చేస్తున్న  ఏ యన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్  సభ్యులు ముందువరుసలో ఉంటారని దానికీ ఉదాహరణ వారంరోజుల క్రిందట వారణాసి వినోద్ ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ వద్ద యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్లు పోగొట్టుకొని మరణించడంతో ఆ కుటుంబం పెద్దదిక్కు కోల్పోవడమే కాకుండా రోడ్డున పడే పరిస్థితులు రావడంతోఆకుటుంబాన్నికి ఆదుకోవాలని సహృదయంతో ఏ యన్ ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు
ఆ కుటుంబానికి నెలకు సరిపడే నిత్యావసర సరుకులు , 20వేల ఆర్థిక సహాయం చేశారు. అంతే కాకుండా ఎవరైనా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనే సహృదయం ఉంటే ఏ యన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు
ద్వారా చేయవచ్చు అని అన్నారు . ఈ కార్యక్రమంలో, 73 వ వార్డు కార్పొరేటర్ భూపతి సుజాత,నసీం, శివ,ప్రతాప్,
నెహ్రు నగర్ మహిళా సంఘం, ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.