Home Blog Page 117

ఉప ఎన్నికలపై సీఈసీ క్లారిటీ

0
న్యూఢిల్లీ, జులై 24 (న్యూస్‌టైమ్): కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ సుమిత్ ముఖర్జీ జులై 22 నాటి లేఖ నెం.99/ఉప ఎన్నిక/2020/ ఈపీఎస్‌కు సంబంధించి స‌ర్కారు వివ‌ర‌ణనిచ్చింది. ఈ లేఖ‌కు సంబంధించిన విష‌య‌మై మీడియాలోని కొన్ని విభాగాలు గందరగోళానికి లోన‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌ర్కారు వివ‌ర‌ణ‌నిస్తూ పైన పేర్కొన్న కమ్యూనికేషన్ కేవ‌లం ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించింది మాత్రమే అని స్పష్టం చేసింది. కొన్ని అసాధారణ పరిస్థితుల కారణంగా లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ 03.7.2020 నాటి వీడియో లెటర్...

మహాత్ములకు ఘన నివాళి

0
న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్‌టైమ్): యువతరం స్ఫూర్తి పొందేలా త్యాగం, దేశభక్తి, దిగ్గజ జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల కథలపై పాఠశాల పుస్తకాలలో ఎక్కువ దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ రోజు పిలుపునిచ్చారు. బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్బంగా ఉపరాష్ట్రపతి ఫేస్‌బుక్ ద్వారా ఘన నివాళులు అర్పించారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని ప్రజలను కోరారు. స్మారక సందర్భాలకే వార్తలను కవర్ చేయకుండా, స్వాతంత్య్ర సమరయోధుల, జాతీయ నాయకుల గాథలను నిరంతరం ప్రముఖంగా చూపాలని...

ప్రతి వాడూ విశ్లేషకుడే…

0
హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): పొట్టకోస్తే అక్షరం ముక్క రాని వాడూ ప్రపంచ రాజకీయాలను విశ్లేషిస్తాడు.. అసలు తన ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనివాడు కూడా పెద్ద పరిశోధకుడిలా ఫీలైపోతాడు.. ఈ దరిద్ర్యం అన్ని రంగాలలో ఉన్న మాదిరిగానే మీడియా రంగాన్నీ చుట్టుముట్టింది. అంతే కాదు.. ఇతర రంగాలపై ఆయా భాషల్లో విశ్లేషణలు జరిపే వారి కంటే ప్రత్యేకించి తెలుగులో విశ్లేషణలకు అలవాటుపడ్డ వారితో ‘అసలు మీడియా అంటే ఇలా విశ్లేషణలు చేస్తుందా?’ అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ...

పాత్రికేయుల సంక్షేమం పట్టదా?

0
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దెప్పుడు? 50లక్షల కరోనా బీమా కల్పించాలని అడినా కరుణించరా? 200 చ.గ. ఇళ్ళ స్థలాలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండు వ్యక్తిగత ప్రమాద బీమా, హెల్త్ కార్డులు మంజూరుచేయాలని తీర్మానం... రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛన్లు.. నూతన అక్రిడిటేషన్లు అన్నీ గాల్లోనేనా అన్ని వర్గాలకూ అన్నీ కల్పిస్తూ జర్నలిస్టులకే అన్యాయం ఎందుకు? పాత్రికేయులులేని సమాజాన్ని ఊహించగలమా? అంటూ హితబోధ అధికారంలో ఎవరున్నా జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేదు. వారి బతుకులు అగమ్మగోచరంగా మారాయి. ప్రజా స్వామ్యవ్యవస్థలో నాలుగో మూల స్థంభానికి పునాదిరాళ్ళుగా ఉన్న జర్నలిస్టులు అర్ధాకలితో బతుకుతున్నారు. వారి సంక్షేమానికి...

మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టు

0
లక్షలాది మందికి తాగునీరు ప్రధాని న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్‌టైమ్): మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశం యావత్తూ ఈ రోజున కోవిడ్-19కు వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాడుతుండగా, తూర్పు, ఈశాన్య భారతదేశం భారీ వర్షాలు, వరదల ద్వంద్వ సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. దీని ప్రభావంతో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు, అనేకమంది నిరాశ్రయులయ్యారు. లాక్‌డౌన్ సమయంలో మణిపూర్ ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసిందనీ, ముఖ్యంగా...