విశాఖ గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్):అగనంపూడి పునరావాస కాలనీ కొండయవలస రచ్చబండ వద్ద జరిగిన సమావేశంలో బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ సైనికులకు మరియు సర్వీస్ లో ఉన్న సైనికులు పాత పద్ధతిలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారి టోల్ టాక్స్ లేకుండా చేయాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారికి జాతీయ రహదారులు శాఖ మాత్యులు శ్రీ నితిన్ ఘట్కేసర్ కి మాజీ సైనికుల సంతకాల సేకరణ చేసి వినతి పత్రం పంపడం జరుగుతుందని .మాజీ సైనికులకు గతంలో ఐదు ఎకరాలు భూమి ఇచ్చేవారని విశాఖపట్నం జిల్లా ఆర్థిక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో భూముల విలువ పెరిగి ఎక్కడ ఇవ్వడం లేదని కావున వారు నివాసము కోరకు 500 గజాల స్థలం ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.
అగనంపూడి టోల్ గేటు పెట్టిన దగ్గరనుండి ఎంతోమంది కార్మికులు పని చేస్తున్నారని సుమారు 100 మంది ఉండేవారు ఇటీవల ఫాస్ట్ ట్రాక్ పెట్టడంతో 50 మంది పని చేయుచున్నారని వీరిలో మహిళలు కూడా ఉన్నారని సబ్బవరం-అనకాపల్లి మధ్యలో కొత్త టోల్ ప్లాజా నిర్మించడం జరిగింది ఆ టోల్ ప్లాజా లో వీరిని కొనసాగించాలని దానికి
ఎన్ హెచ్ ఎ ఐ జనరల్ మేనేజర్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.
శ్రీ పైడిమాంబ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ నాయకులు మేడిశెట్టి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన
జరిగిన సమావేశంలో మాజీ సైనికుల ప్రతినిధులు సిహెచ్ సత్యనారాయణ కె నర్సింగ్ రావు విందుల సూర్యనారాయణ సూర్యారావు విందుల సత్యనారాయణ టోల్గేట్ కార్మికులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.