విశాఖ గాజువాక జూలై 01 (ఎస్‌ఎస్ 999 న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి కూడా సొంతింటి కళ నిజం చేయాలనే ఆలోచనతో ఇప్పటికే జగనన్న కాలనీల రూపంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.అలాగే స్థలం ఉండి ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ప్రభుత్వం తరపున 1.80లక్షల రూపాయలు మంజూరు చేస్తూ పేద బడుగు-బలహీన వర్గాల పక్షపాతిగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం వైస్సార్సీపీ పార్టీ అని 66వ వార్డు వైస్సార్సీపీ కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ అన్నారు.స్థానిక వార్డు పరిధిలో మెగా గ్రౌండింగ్ మేళా గృహనిర్మాణలో భాగంగా అజీమాబాద్, సీతారాం నగర్,బీసీ రోడ్డులో బి యల్ సి  లోన్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలకు స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి  అదేశాలతో గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సహకారంతో వార్డులో పలు చోట్ల నూతన గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.

కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెక్రటరీ యస్ యం డి గౌస్ ,ఎన్నేటి కనకరావు,పెదరెడ్ఈశ్వరరావు,షఫీ,ఖాజా,మోతి,దేముడుబాబు,రాజు,బడాబాబు,నఫీజ్,బాషా,నానజీ, నయిమ్,జగన్,షాహిద్,సచివాలయ సిబ్బంది,సానిటరీ సిబ్బంది,వార్డు నాయకులు,మహిళలు,యువత పాల్గొన్నారు.