విశాఖ గాజువాక జూన్ 28 (ఎస్‌ఎస్ 999 న్యూస్):పెద గంట్యాడ జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక వైఎస్సార్సీపీ ఇన్చార్జ్  తిప్పల దేవన్ రెడ్డి  విచ్చేసారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి  స్టూడెంట్స్ కి చాలా పథకాలు పెట్టారు. జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మ ఒడి ఇలా చాలా పథకాలు అందులో ఒక పథకం జగనన్న గోరుముద్ద. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం స్కూల్లో చదువుకున్నటు వంటి స్టూడెంట్స్ కి పౌష్టిక ఆహారం ఒక రోజులో ఉండే మెనూ ఇలా వారానికి రోజు ఒక మెనూ స్టూడెంట్స్ కి పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. మరి పేద స్టూడెంట్స్ కి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆరు కేజీలు కందిపప్పు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరిగింది అని దేవన్ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మీబాయి, స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ శ్రీనివాసరావు, స్కూల్ కమిటీ చైర్మన్ మోహన్ రాజు, మురళి ఆనoద్, స్టూడెంట్స్, టీచర్స్, కార్యకర్తలు పాల్గొన్నారు.