విశాఖ గాజువాక జూలై 20 (ఎస్‌ఎస్999న్యూస్): హోలీ ఫెయిత్ చర్చ్ 22 వార్షికోత్సవ వేడుకలను కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ చర్చ్ ఫాస్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు సింహగిరి హాస్పిటల్ యం డి కళ్యాణ్ పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఎన్నో ప్రార్థనలు చేయడమే కాకుండా పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మంది పేద వారికి అండగా నిలుస్తున్న చర్చ్ ప్రతినిధులను అభినందించారు. కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా పోలీస్ యంత్రాంగానికి, శానిటేషన్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి అలాగే సచివాలయ సిబ్బందికి, వాలంటరీ లకు, ఆశా వర్కర్లకు ఏ ఎన్ అమ్మలకు, పేదవారికి, వృద్ధులకు, అనాధ శరణాలయంలో చిన్నారులకు ఇలా ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా హోలీ ఫెయిత్ చర్చ్ నిలిచిందని కళ్యాణ్ అన్నారు. ఫాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ హోలీ చర్చి స్థాపించి నేటికీ 21వసంతాలు పూర్తయిందని తెలిపారు. ఈ చర్చి స్థాపించినప్పటి నుండి నేటి వరకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు.

తమ చర్చి 22 వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కళ్యాణ్ రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఎంతో మంది పేద వారికి ఉచితంగా వైద్యం అందించిన ఘనత సింహగిరి హాస్పిటల్ కి చెందిందని అన్నారు. కళ్యాణ్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఎంతోమంది పేద వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తూ పేరు సంపాదించారని చెప్పేరు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎస్ రాజు, ఎస్ పాపా, ఎస్ సురేఖ, ఉదయ్ క్రాంతి, రాజు, ఎస్ ప్రేమ్, పెదరెడ్ల ఈశ్వరరావు, ఎం తిమోతి రాజు, ఐశ్వర్య, జరీనా, క్రాంతికుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. చర్చి 22 వ వార్షికోత్సవం సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న ఆశా వర్కర్లకు ఏ ఎన్ అమ్మలకు, సచివాలయ సిబ్బందికి మరికొంత మంది పేద వారికి డాక్టర్ కళ్యాణ్ చేతుల మీదగా  నిత్యావసర సరుకులు అందజేశారు.