అద్దంకి పట్టణంలో కరోని నియంత్రణ చర్యలు చేపట్టిన దృశ్యం

ఒంగోలు, జులై 24 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఈ రోజు నుంచి వారం రోజులపాటు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మండల టాస్క్‌ఫోర్స్ అధికారి, తహసీల్దార్ సీతారామయ్య తెలియజేశారు. అద్దంకి పట్టణంలో ఇప్పటివరకు 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో నమోదైన కేసులతో కలుపుకుంటే మొత్తం 67 కేసులు నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీతారామయ్య తెలియజేశారు.

ఈ రోజు నుండి నిత్య అవసరాలు అయిన పాలు, కూరగాయలు అమ్మే షాపులు కూడా తెరవకుడదని అలా కాకుండా ఎవరైనా నిబంధనలను అతిక్రమించి వ్యాపారాలు చేస్తే వారి షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన తెలియజేశారు. మద్యం షాపులు ఈ వారంరోజులు ముసివుంటాయని, కేవలం అత్యవసర సర్వీసులు, మెడికల్ షాపులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు. ప్రజలు ఎవరైనా అనసరంగా బయటికి రావద్దని, మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అస్సలు బయటకు రావద్దని, అలా కాదని బయట తిరిగితే అంటు వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, మండలంలోని ప్రతిఒక్కరూ మస్కులు తప్పనిసరిగా ధరించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకొంటూ వ్యక్తిగతపరిశుభ్రత పాటిస్తే కరోనా కోరల్లో నుండి స్వీయ రక్షణపొందవచ్చన్న వైద్యుల సలహాలు, సూచనలు పాటించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ మండల, పట్టణ ప్రజలకు విన్నవించారు.

పట్టణంలోని అన్ని బజారులో, ప్రధాన రహదారుల్లో, మైక్‌ల ద్యారా అనౌ‌స్ చేయిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ, అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలోని ప్రజాసంఘాల వారు కూడా ప్రత్యేక వాహనం ఏర్పాటుచేసి మండలంలోని ప్రతి గ్రామాన త్రిప్పుతూ కరోనాపై అవగాహన కల్పిస్తూ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మైకు ద్యారా, స్క్రీన్‌పై చూపించి ప్రజలను చైతన్య పరుస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు.