విశాఖ గాజువాక జూన్ 09 ( ఎస్‌ఎస్999న్యూస్): స్థానిక జీవీఎంసీ 66వ వార్డులో గత 6రోజులుగా వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ పర్యటిస్తూ ప్రజాసమస్యల పట్ల దృష్టిసారిస్తున్నారు. శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ సమస్యను ఎప్పటికపుడు సానిటరీ వ్యవస్థ ద్వారా శుభ్రం చేయించడం అలాగే రహదారుల మరమ్మతులు,నూతన రహదారుల పనులను పరిశీలించి అలాగే కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని సందర్శించి అక్కడి వైద్య సిబ్బంధితో మాట్లాడి ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు సక్రమమైన దారుల్లో అందజేయాలని అన్నారు.అలాగే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ సహాయంతో కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికలకు,రోజువారీ కూలీలకు,పేదలకు సుమారు 600మందికి ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇర్ఫాన్,ఎస్సి సెల్ రాజా,మోతి,రమణారెడ్డి,మాస్టర్ సాబ్,మాధవరావు,శ్రీనివాసరెడ్డి,యస్ కె ఆశ,లక్ష్మీ,ఫాతిమా,రాజు,నర్సింగ్,వైస్సార్సీపీ పండు,నయిమ్,హేమంత్,ఇమ్రాన్ యువసేన,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here