విశాఖ గాజువాక జూన్10 (ఎస్‌ఎస్999న్యూస్):పెద గంట్యాడ కరోనా సమయంలొ విధి నిర్వహణలో పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమని 64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. కోవిడ్ సమయంలొ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజనం ప్యాకెట్లు ను అందజేశారు. ఈ సందర్భంగా 64 వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచనలు మేరకు గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్ఫ్యూ పెట్టినప్పుడు నుండి నేటి వరకు ఒక్క వార్డు లోనే కాకుండా నియోజక వర్గంలో అన్నీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. కార్య క్రమంలో తిప్పల గోపీ, సోమరెడ్డి, వెంకట రెడ్డి, కాకి రెడ్డి, జగదీష్ రెడ్డి, అప్పల రెడ్డి, సోమ రెడ్డి, సాగర్ రెడ్డి, వైసీపీ నాయకులు యువకులు కార్య కర్తలు తది తరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here