విశాఖ గాజువాక జూన్ 09 (ఎస్‌ఎస్999న్యూస్)పెదగంట్యాడ: జీ.వీ.ఎం.సీ 64 వార్డు వైసీపీ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆద్వర్యంలో 64 వార్డ్ లో ఉన్న శానిటరీ సిబ్బంది కి, సూపర్ వైజర్స్ కు భోజనము ప్యాకెట్లు, పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసారు. కార్య క్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని అందజేశారు. ఈ సందర్భంగ దేవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలొ ప్రజలకు సేవలు అందిస్తున్న వారిలో శానిటరీ సిబ్బంది ఒకరని అన్నారు. ఈ సమయంలో వారు చేస్తున్న సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించాలని అన్నారు. ఈ సందర్భంగ వార్డు ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ముందుకూ వచ్చి శానిటరీ సిబ్బందికు భోజనము, పండ్లు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసి వారికి అందించడం అభినంద నీయమన్నరు. అన్ని వర్గాల వారికి, వార్డు ప్రజలకు, వైసీపీ కార్య కర్తలకు, రిపోర్టర్స్ కు ఇలా అందరకీ నేనున్నానంటూ ముందుకూ వాస్తు సాయమందిస్తున్న ధర్మాల శ్రీనివాసరావు చేస్తున్న సేవలు ను ప్రతీ ఒక్కరూ అభినంద నించ వలసిన విషయమని అన్నారు. ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎలా అండగా ఉన్నారో గాజువాక ప్రజలకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అలాగే ఎప్పుడు అండగా ఉంటారని ఆయన అడుగు జాడల్లో, ఆయన ఆదేశాలు మేరకు నిత్యం ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. కార్య క్రమంలో తిప్పల గోపీ, సోమ రెడ్డి, వెంకట రెడ్డి, కాకి రెడ్డి, జగదీశ్ రెడ్డి, అప్పల రెడ్డి, నీలాపు అప్పల రెడ్డి, సోమ రెడ్డి, సాగర రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బంది, వైసీపీ నాయకులు యువకులు కార్య కర్తలు తది తరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here