విశాఖ గాజువాక జూలై 01 ( ఎస్‌ఎస్ 999 న్యూస్):-కరోనా మహమ్మారి కాటుకు బలైపోయిన వార్డులోని వైసీపీ కుటుంబాలకు 65 వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అండగా నిలిచి నిత్యావసరాలను వితరణ చేశారు.రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం గాజువాక బీసీ రోడ్డు కాకతీయ కూడలిలోని వైఎస్సార్ విగ్రహం వద్ద పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.ముందుగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.అనంతరం వార్డులోని 22 మంది కార్యకర్తల కుటుంబాలకు నెలరోజులకు సరిపడ నిత్యావసర సరుకులను నరసింహ పాత్రుడు అందజేశారు. తన విజయం వెనక అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలు కరోనా మహమ్మారితో మరణించడం బాధాకరమని అన్నారు.ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన పిలుపుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మద్దాల అప్పారావు,ఇరోతి గణేష్,ఎన్ వై నాయుడు,లోకనాధం,జుత్తు లక్ష్మీ, దేవుడు,అడిగర్ల రమణ,రాజు,ఆకుల దుర్గ,ఫణి తదితరులు పాల్గొన్నారు