విశాఖ  గాజువాక జూన్ 09 ( ఎస్‌ఎస్999న్యూస్): 88వ వార్డు ఇంచార్జ్ జనసేన బలపరిచిన బీజేపి ఉమ్మడి అభ్యర్ది గా ఇటీవల  జి వి యం సి ఎన్నికలలో పోటీచేసిన సీనియర్ నాయకులు దాడి. నూకరాజు జన్మదిన సందర్బంగా కోట నరవ లో గల ఆయన కార్యాలయానికి వెల్లి శుభాకాంక్షలు తెలిపి, పుష్పగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించారు. అనంతరం వార్డులో గల కొంత మంది పేదలకు చీరలు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా కరణంరెడ్డి. నరసింగరావు మాట్లాడుతూ దాడి .నూకరాజు  మంచి సేవాతత్పరులని గత 16 సం.లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేసారని,భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులను అదిరోహించాలని, ఆయురారోగ్యాలతో సంతోసంగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. కేంద్రంలో బీజేపి ప్రభుత్వ సంక్షేమ పతకాలను ప్రజల్లోకి తీసుకొని వెల్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. దాడి.నూకరాజు గారు మాట్లాడుతూ జనసేనతో కలసి వార్డులో సమస్యల పరిష్కారానికి పెద్దలు పి .వి.ఎన్ మాధవ్ , జిల్లా అధ్యక్షులు  మేడపాటి. రవీంద్ర, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కరణంరెడ్డి. నరసింగరావు దృష్టికి తీసుకొని వెల్లి ప్రజల సమస్యలను పరిష్కరించి పార్టీ బలోపేతానికి నా శక్తి మేరకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బీజేపి పార్టీ నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here