విశాఖ  గాజువాక జూన్ 27 (ఎస్‌ఎస్ 999 న్యూస్ ):ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించి ప్రపంచ రికార్డు సాదించిన అన్మిష్ వర్మ భూపతిరాజు కి విశాఖ విమానాశ్రయం లో గణ స్వాగతం పలికిన క్రీడా సంఘం ప్రతినిధులు కరణంరెడ్డి. నరసింగరావు ,శివాజీ ,శ్రీనివాసరావు ,దిలీప్ వర్మ తదితరులు. ఈ సందర్బంగా కిక్ భాక్సింగ్ సంఘం రాష్టృ గౌ.అద్యక్షులు కరణంరెడ్డి. నరసింగరావు మాట్లాడుతూ అన్మిష్ వర్మ  చిన్న వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అదిరోహించడమే కాకుండా , గతంలో కిక్ బాక్సింగ్ మరియు కరాటే క్రీడలలో కూడ అంతర్జాతీయ స్తాయిలో బంగారు పతకాలను సాదించారని అన్నారు. విపత్కర సమయంలో ప్రతికూల వాతావరణంలో కూడా తన ప్రాణాలను పణంగా పెట్టి ఎవరెస్టు శిఖరం అదిరోహించడం గొప్ప విషయమని , నేటి యువతకు ఆయన ఆదర్శమని కొనియాడారు. రాష్టృ ప్రభుత్వం వీరిని గుర్తించి క్రీడాకారుల కోటా లో ఉద్యోగం,ఇంటి స్తలం,50 లక్షల రూపాయల నగదు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు,యువకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.