విశాఖ గాజువాక జూన్ 28 ( ఎస్‌ఎస్ 999 న్యూస్):ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూన్న దానబోయిన అప్పలనాయుడు మరింత ముందుకు కొనసాగాలని మనం చారిట్రబుల్ ట్రస్ట్  డా.ముత్యాల బాలాజీ అన్నారు.
పెదమడక ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యదర్శి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు  దానబోయిన అప్పలనాయుడు 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దానబోయిన అప్పలనాయుడు కేక్ కటింగ్ చేసి పేదవారికి భోజనం పేకట్లు,మాస్కులు,శానిటైజర్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా.ముత్యాల బాలాజీ మాట్లాడుతూ మానవ జన్మలో స్వార్ధం విడనాడి ప్రజా శ్రేయస్సు కోసం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. దానబోయిన అప్పలనాయుడు మాట్లాడుతూ మూడు శతాబ్దాలు స్టీల్ ప్లాంట్ లో విధినిర్వహన నిర్వహించి పదవి విరమణ చేసిన తరువాత మా పరిధిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని ఆ సేవలోనే నా ఆనందాన్ని ఆస్వాధిస్తున్నాని అన్నారు.
ఎడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకులు కొలిపాక అప్పారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కసిపల్లి శ్రీనివాసరావు,సిడబ్ల్యూసి కార్యదర్శి వంకర రాము,నటరాజ కళాసమితి కట్టా పైడిరాజు,హెడ్ కానిస్టేబుల్ కె.విష్ణు,ఆలయ ప్రధాన అర్చకులు పల్లంరాజు శర్మ,స్థానిక నాయకులు అమరపిన్ని సోమి నాయుడు,ఏ. దేముడు తదితరులు పాల్గొన్నారు.