విశాఖ జూన్ 10 (ఎస్‌ఎస్ 999 న్యూస్):కరోనా కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు అన్నారు
ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం,సాక్షి ఆఫీసు లైన్ 26 వార్డుకు చెందిన ఒక కుటుంబంలో పిల్లలు బి.ఉషశ్రీ,బి.ప్రేజ్వల్ కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోవడంతో వారికి ప్రభుత్వం మంజూరు చేసిన 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండును ఆ పిల్లలకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు వారి చేతుల మీదగా అందజేశారు.
ఈ సందర్భంగా కె.కె రాజు  మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఏ ఒక్క కుటుంబం ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అన్ని విధాల తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.కార్యక్రమంలో 26వార్డు ఇంచార్జ్ పీలా వెంకటలక్ష్మీ,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరావు,43వార్డు కార్పొరేటర్ పి.ఉషశ్రీ, వి ఆర్ ఓ వర్మ,పోతు సత్యనారాయణ,రవిబాబు,శ్యామల,అమ్మాజీ,సునీల్,శేషు,సచివాలయం& వాలంటరీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here